ట్రాక్టరు కింద పడి రైతు మృతి

నిజామాబాద్‌ గ్రామీణం: మండలంలోని కులాన్‌పూర్‌కు చెందిన స్థానిక రైతు గంగారెడ్డి ట్రాక్టరు కింద పడి మృతి చెందాడు. ట్రాక్టరులో ఉల్లి గడ్డలు నింపుకుని తరలించే ప్రయత్నంతో అదే ట్రాక్టరు కింద జారి పడి చనిపోయాడు.