డిఎస్‌సిని వాయిదా వేయబోం : పార్ధసారధి

హైదరాబాద్‌, జూలై 10 : డిఎస్‌సిని ఎట్టి పరిస్థితుల్లోను వాయిదా వేయబోమని మంత్రి పార్ధసారధి అన్నారు. మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆయన పై విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే ఏడాది డిసెంబరులో మరో డిఎస్‌సి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆ డిఎస్‌సిలో అందరికీ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుత డిఎస్‌సిలో బిఎడ్‌, డిఎడ్‌ చదువుతున్న వారికి అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. డిసెంబరులో జరగనున్న డిఎస్‌సిలో అనుమతి ఇస్తామని తెలిపారు. ప్రస్తుత డిఎస్‌సి షెడ్యూలు ప్రకారమే జరిపి తీరుతామని చెప్పారు. విద్యార్థులు పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాలని కోరుతున్నామని వెల్లడించారు.