డిగ్డోల్‌ వద్ద లోయలో పడ్డ బస్సు

14మంది అమరనాధ యాత్రీకులు మృతి
మరో 30మందికి గాయాలు
శ్రీనగర్‌, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): జమ్మూ-కాశ్మీర్‌ రహదారి పక్కన డిగ్డోల్‌ సమీపంలోని లోయలో బస్సు పడిన దుర్ఘటనలో 14మంది అమరనాధ యాత్రికులు మృతిచెందారు. 30మంది గాయపడ్డారు. యాత్రికుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. రక్షణ దళాలు దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. వివరాల్లోకెళితే.. అమర్‌నాధ్‌ యాత్ర ముగించుకుని హిమాచల్‌ప్రదేశ్‌లోని పుణ్యతీర్థాలను దర్శించుకునేందుకు ఒక బస్సులో యాత్రీకులు శనిÄరం బయల్దేరారు. శనివారం తెల్లÄావారుజామున డిగ్డోల్‌ వద్ద జాతీయ రహదారిపై మలుపు తిప్పుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి పక్కనున్న లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతిచెందారు. మరో 30మందికి గాయాలయ్యాయి.వారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వారు టాండాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్షణ దళం రంగంలోకి దిగింది. ఆ లోయ 250మీటర్ల అడుగులు ఉంటుందని అంచనావేేస్తున్నారు. బస్సు శిధిలాల కింద మరో ఇద్దరో..ముగ్గురో ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది. మృతి చెందిన యాత్రీకులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా భావిస్తున్నారు. గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరిన్ని ్టార్తలు అందాల్సి ఉంది.
మంచు వర్షం వల్లే..
జమ్ము-కాశ్మీర్‌ జాతీయ రహదారిపై మామూలు రోజుల్లోనే విపరీతమైన రద్దీ ఉంటుందని, అమర్‌నాధ్‌ యాత్ర ప్రారం
భం అయినప్పటి నుంచి రద్దీ మరింత పెరిగిందని, మలుపుల వద్ద తగిన రక్షణ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పైగా కొద్ది రోజులుగా విపరీతంగా మంచు కురుస్తుండడం.. వాహనాల టైర్లు స్కిడ్‌ అవుతుండడంతో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని తెలిపారు. ఆ మలుపులు కూడా ఇరుకుగా ఉండడం ప్రమాదానికి మరో కారణమని చెబుతున్నారు. అందులో డ్రైవరు రెప్పపాటు కునుకు తీస్తే ఇక అంతేసంగతులు అని అంటున్నారు. ఏది ఏమైనా ఇరుకైన మలుపుల వద్ద రక్షణ వలయాలు ఏర్పాటు చేయాల్సిందేనని కోరుతున్నారు. పైగా కొద్ది రోజులుగా విపరీతంగా మంచు కురుస్తుండడం.. వాహనాల టైర్లు స్కిడ్‌ అవుతుండడంతో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని తెలిపారు. ఆ మలుపులు కూడా ఇరుకుగా ఉండడం ప్రమాదానికి మరో కారణమని చెబుతున్నారు. అందులో డ్రైవరు రెప్పపాటు కునుకు తీస్తే ఇక అంతేసంగతులు అని అంటున్నారు. ఏది ఏÄెుౖనా ఇరుకైన మలుపుల వద్ద రక్షణ వలయాలు ఏర్పాటు చేయాల్సిందేనని కోరుతున్నారు.