డిగ్రీ అర్హత కలిగిన డీఎడ్‌ అభ్యర్థులకు శుభవార్త

హైదరాబాద్‌: డీఎడ్‌ తో పాటు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలని ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలని, డీఎడ్‌తో పాటు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీనికి స్పందించిన మంత్రి రేపు ఈ విషయమై న్యాయనిపుణుల సలహ తీసుకుని హైకోర్టుకు వెళతామన్నారు. షెడ్యుల్‌ ప్రకారమే డీఎస్సీ నిర్వహించేలా చూస్తామని తెలిపారు.