డిజిల్‌, వంటగ్యాస్‌ అభివృద్ది విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: చిదంబరం

ఢిల్లీ: ప్రభుత్వం మరిన్ని కొత్త ప్రణాళికలు చేపట్టనుందని, అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. డీజిల్‌ ధరల పెంపుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబుడులపై పునరాలోచన లేదని, వంటగ్యాస్‌ సిలిండర్ల పరిమితిపైన వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణపై మరిన్ని నిర్ణయాలుంటాయాన్నరు. 4 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణల వల్ల 6 నెలల్లో రూ.30 వేల కోట్ల సమీకరణ లక్ష్యమని వ్యయ నియంత్రణ, పన్ను వసూళ్ళలో కఠిన చర్యలతో అధిక నిధుల సమీకరణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు.