ఢిల్లీ అత్యాచార ఘటన బాధితురాలు మృతి

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు సింగాపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం ఉదయం 2:15 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని సర్ధార్‌ జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న ఆమెకు మెరుగైన వైద్యం నిమిత్తం అవయవ మార్పిడి కోసం సింగాపూర్‌లోని మౌంట్‌ ఎలిజబిత్‌ ఆస్పత్రికి గురువారం తరలించిన విషయం తెలిసిందే. 13 రోజులుగా మృత్యువుతో పోరాడుతు ఆమె ఉదయం మృతి చెందింది. భారత హైకమిషన్‌ ఉదయం ఎనిమిది గంటలకు బాధితురాలి మృతిపై ప్రకటన చేయనుంది.