ఢిల్లీ ఆందోళనల్లో గాయపడిన కానిస్టేబుల్‌ మృతి

ఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన కానిస్టేబుల్‌ సుభాష్‌ తోమర్‌ (45) మృతిచెందారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. వైద్య విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షంచాలని ఇండియాగేట్‌ వద్ద ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులను నియంత్రించే క్రమంలో తోమర్‌ తీవ్రంగా గాయపడ్డారు.