ఢిల్లీ చాందినీ చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. చాందినీ చౌక్‌లోని విద్యుత్‌ ఉపకరణాలు అమ్మే భగరథ్‌ ప్యాలన్‌లలో అగ్నిప్రమాదం  సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.