తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం దుర్ఘటనపై ప్రధాన మన్మోహన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు అవసరమైన సహకారం అందించవలసిందిగా రైల్వే శాఖ మంత్రిని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టవలసిందిగా సూచించారు.