తరతరాలుగా
భూస్వాముల దగాకోరు పాలనలో బాంచన్ నీ కాల్మొక్త అన్న భావనను పటాపంచలు చేసిన
ఆంధ్ర మహాసభ ఉత్తేజముతో చైతన్యాన్ని నింపిన వీర తెలంగాణ
నాటి 1944 నాటి ఆంధ్ర మహాసభ రావి నారయ
అధ్యక్షతతో
భూస్వాముల దౌర్జన్యం దొరల దాస్టికం తొలగడం కోసం పోరు చేసిన సామాన్యుడి గొంతు
రైతు కూలీ మహిళా వీర తెలంగాణలో
దేవులపల్లి వెంకటేశ్వరరావు
ఆరుట్ల సోదరుల ఆత్మస్థైర్యముతో
ప్రజలంతా ఏకమై
దేశ్ముకుల దేశ్పాండేలా
పోరాటపు ఎర్రజెండా పతాక ఎగిసి ఎగిసి పడింది
ఒక చాకలి ఐలమ్మ ఒక బందగి అందించిన యుద్ధం ఒక బియన్ రెడ్డి
ఊరు పతాకమై పోరు జెండాతో
ఒక బద్దం ఎల్లారెడ్డి అందుకున్న చైతన్యం
పోరాటం కెరట కెరటాలుగా ఊరూరును చుట్టుముట్టి
నాటి మిలిటరీ పాలనకు ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపు పోరు బాటలో సాగింది
నాటి నిజాం నిరంకుశ ఆగడాలను
కాసిం రాజ్వి అనుచరుల అమానుషాలను
స్త్రీ పురుషులు పిల్లలు అంతా కలిసి
ఒక మల్లు స్వరాజ్యమై
వీరనారి పోరాటాన్ని చిత్రించిన గాధలెన్నో
ఊరూరా జనగామలో చైతన్యమై దొడ్డి కొమరయ్య కావచ్చు
తెలంగాణ వీర విప్లవ సింహం నల్లా నర్సింహులు చైతన్యం కావచ్చు
ఆ కదలిక ఆ ఐక్యత
గుత్పలు కావచ్చు ఒడిసెలు కావచ్చు
అటు రజాకారులను ఇటు మిల్ట్రీని తరిమి కొట్టిన వీర చైతన్యపు తెలంగాణ నేడు వజ్రోత్సవ కాలాన్ని గడుపుతున్నది
తెలంగాణ నిజాం అడుగుజాడలను మటుమాయం చేసింది
ఒక బండి వెనుక బండి కట్టి పాట పాడిన బండి యాదగిరి
సుద్దాల హనుమంతు
పల్లెటూరి పిల్లగాడే కావచ్చు
ఎర్రజెండా ఎరుపెక్కించిన అమరుల రక్తం తో ఎరుపెక్కింది తెలంగాణ మట్టి నేల
ఇక్కడి మట్టి బిడ్డలు ఎందరో మహావీరులై కళారూపాలతో కదలికలు తెచ్చారు జనం జనం
ఫోను చేసిన గత ఘనత భావితరాలకు వీర గీతాలను ఆలపిస్తూనే ఉంటుంది చైతన్యంతో నిండిన ఘనత మళ్లీమళ్లీ చాటాల్సి ఉంది రేపటి తరాలకు
తెలంగాణ తెలంగాణ వీర భూమి తెలంగాణ
కులం లేదు మతం లేదు ప్రజలందరూ మనిషి కులంగా సాగిన నాటి పోరాట గాధలు ఊరూరా వినిపిస్తూనే ఉంటాయి అమరవీరుల స్తూపాలపై ఎర్రజెండా నీడలో ఎందరో వీరులు ఒరిగిన గాదలెన్నో నీకు కథలుగా ఈనాటి తరాలకు అందించే ఆకాంక్షలు .
ప్రజాకాంక్షలు నీతికి
సర్వస్వంగా ఐక్యమైన పోరాట గాధలు నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర చైతన్యం జాలువారుతూనే ఉంటుంది
తెలంగాణ వజ్రోత్సవ సంబరాల సందర్భంగా
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు, ఖమ్మం భువనగిరి కోట 7702537453