తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు


వేములవాడ, మార్చి 23 (జనంసాక్షి) : తాటిచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడగా వ్యక్తికి గాయాలైన సంఘటన వేములవాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ పట్టణానికి చెందిన నేరెళ్ల ఆంజనేయులు గౌడ్ రోజువారి పనిలో భాగంగా గురువారం వేములవాడ పట్టణంలోని బాల నగర్ లో తాటి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నేరెళ్ల ఆంజనేయులు గౌడ్ ను రాష్ట్ర నాయకులు సంపునూరి మల్లేశం గౌడ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు వస్తాద్ కృష్ణ గౌడ్, చిలువేరి శ్రీనివాస్, నేరల్ల శ్రీధర్, వెంకటేష్ గొడిసెల శ్రీనివాస్, ముంజ మహేష్, జవ్వజీ శేఖర్ లు పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే అతనికి ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు.