తెదేపాపై కేసీఆర్‌ విమర్శలు సిగ్గుచేటు : శ్రీహరి

వరంగల్‌ : అఖిలపక్ష భేటీలో తెదేపా వైఖరిని తెరాస అధినేత కేసీఆర్‌ విమర్శించడంపై ఆ పార్టీ నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో తెదేపా వైఖరిని తెలంగాణవాదులు స్వాగతిస్తే కేసీఆర్‌ విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే కేసీఆర్‌ తెదేపాపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖ కాదు. అఖిలపక్షంలో ఇచ్చిందే అఖరిది. అదే మా విధానమని ‘ ఆయన స్పష్టం చేశారు.