తెదేపాలో చేరిన రావి వెంకటేశ్వరరావు

హైదరాబాద్‌: ముందుగా ప్రకటించిన ప్రకారమే గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఆయన మొదటి బాలకృష్ణతో భేటీ అయ్యారు. అనంతరం బాలకృష్ణ, రావి కలిసి చంద్రబాబుతో భేటీ అయి పార్టీలో చేరుతున్న విషయం ప్రకటించారు.