తెలంగాణకు హమీఇస్తేనే రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొనాలి

హైదరాబాద్‌:తెలంగాణ అంశంలో రాజకీయ పార్టీలు పదేపదే ద్రోహం చేస్తున్నాయని తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జల కాంతం ధ్వజమెత్తారు.ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నిక అన్ని పార్టీలు ఐక్యంగా ఉంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు.ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు.ప్రణబ్‌ముఖర్జీ తెలంగాణ వ్యతిరేకిని ఆరోపించారు.తెలంగాణ ఇస్తామని,రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడతామని హమీఇస్తేనే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.హమీ రాకుండా ఓటింగ్‌లో పాల్గొంటే ఆ ప్రజాప్రతినిదుల ఇళ్లపూ దాడికి వెనుకాడమని కాంతం హెచ్చరించారు.ఈ విషయంలో కాంగ్రెస్‌,తెదేపా,భాజపా,తెరస తమ నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్రపతి ఎన్నిక నేపధ్యంలో జూలై జైబ్లీహలులో ప్రజాసంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.