తెలంగాణ,కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్: తెలంగాణ, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. వాయువ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. విదర్భ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రమే ఉంటాయని ఐఎండీ తెలిపింది.