తెలంగాణపై 28 తేదీలోగా కాంగ్రెస్‌ వైఖరి వెల్లడించారు : హరీష్‌

దౌల్తాబాద్‌: ఈ నెల 28 లోగా తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైఖరి తెలపాలని తెరాస నేత హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌  ఎంపీలు తెలంగాణ ప్రజలవైపు ఉంటారో తేల్చు కోవాలన్నారు. ఈరోజు మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌లో వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరుతున్న సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు అఖిలపక్షానికి  హాజరుకావాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తెలంగాణ ఓ ఒక్క సమైకాంధ్ర పార్టీల దిమ్మలుగాని, జెండాలు గాని ఉండనివ్వబోమని హెచ్చరించారు. మెదక్‌ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి కావాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రులు ఈ ప్రాంతంలో అన్ని వనరులను కొల్లగొట్టారని, వారిని ఈ తెలంగాణ నుంచి తరిమికొట్టాలని తెరాస కార్యకర్తలకు పిలుపునిచ్చారు.