తెలంగాణలో టీడీపీ ఎప్పుడోగల్లంతైంది: ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీ ఎప్పుడో గల్లంతైందని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్‌ ఉప ఎన్నికల్లో టీడీపీకి కేవలం 1800 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయని తెలియజేశారు. వేములవాడలో ముష్టి మూడువేల ఓట్లు కూడా రాలేదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజా ధానాన్ని దోచుకున్నాడని ఈటెల ఆరోపించారు.