తెలంగాణ అంశం తేలడం ఖాయం: కేసీఆర్‌

హైదరాబాద్‌: పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్‌ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ బయల్దేరి ముందు కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈనెలఖారు లోపు తెలంగాణ అంశం తేలిపోవడం ఖాయమని ఆయన చెప్పారు. పార్లమెంట్‌ సమావేశల్లో పాల్గొనేందుకు ఢిలీంల వెళ్తున్నానని తెలియజేశారు. ఢిల్లీలో తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణపై ఎవరు అనుమాన పడాల్సిన అవసరం లేదన్నారు.