తెలంగాణ కవాతుకు వస్తున్న 200 మంది అరెస్టు

నల్గొండ: తెలంగాణ కవాతు కోసం నల్గొండ జిల్లా నుంచి వస్తున్న వివిధ పార్టీలకు చెందిన 200 మంది ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే  పోలీసులు నేతల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో జరిగిన ఉద్యమాల్లో వీరిపై కేసులు ఉన్నాయని అందుకే అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలిజేశారు. ఎక్కువగా నకరేకల్‌లో 17 మంది, హాలీయలో 15 మంది, సాగర్‌లో 15 మంది ,వలిగొండలో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నేతలు తెలియజేశారు. అరెస్టయిన వారిలో జిల్లా తెరాస అధ్యక్షుడు బండా నరేంద్రరెడ్డి, మహిళా అధ్యక్షురాలు శరణ్యారెడ్డి తదితరులు ఉన్నారు.