తెలంగాణ కోసం ఈ నెల 30న భారీ ఉద్యమం:జేఎసీ
న్యూఢిల్లీ: తెలంగాణ అంశాన్ని నాన్చితే ఈ నెల 30న భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని తెలంగాణ రాజకీయ జేఎసీ నేతలు హెచ్చరించారు. ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని కూడా చెప్పారు. జేఎసీ ఛైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో నేతలు ఈ రోజు ఇక్కడ కేంద్ర మంత్రి వయలార్ రవిని కలిశారు. తెలంగాణపై తర్వగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్వకతను గుర్తించామని వయలార్ రవి వారికి చెప్పారు. తెలంగాణ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరుతామన్నారు. రేపు కేంద్ర మంత్రులు షిండే, ఆజాద్‌లను కలిసే ప్రయత్నం చేస్తానని వయలార్ తనతో చెప్పినట్లు కోదండరాం చెప్పారు.