తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జెండా పండుగ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ కార్యాలయంలో జెండా పండుగ ఘనంగా జరిగింది జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని జేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సెప్టెంబర్ 30న జరగబోయే ‘ తెలంగాణ మార్చ్’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమమే స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవాలని తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. బ్రిటీష్ వారిని పారదోలే వరకు స్వాతంత్య్ర సమర యోధులు పోరాడారని, అలాగే మనం కూడా ఆంధ్రా వలస పాలకులను తెలంగాణ నుంచి వెళ్లగొట్టే వరకు ఉద్యమం జరుగుతుందని కోదండరాం హెచ్చరించారు.