తెలంగాణ మార్చ్‌ వాయిదాకోసం కేకేతో హోం మంత్రి భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ వాయిదాకోసం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు కొనసాగిస్తున్నారు. హోం మంత్రి ఈ సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనం, జీవవైవిధ్య సరస్సు ఉన్న దృష్ట్యా మార్చ్‌ వాయిదా వేసుకుంటే బాగుంటుందని ఐకాస నేతలతో మాట్లాడానికి కేకేను కోరారు. మార్చ్‌ విషయమై ఇప్పటికే ఐకాస నేతలు చాలా ముందుకు వెళ్లారని వాయిదా వేసుకుంటారా అని కేకే ప్రశ్నించినట్లు తెలిసింది.