తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలి


` కెసిఆర్‌ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది
` బీసీ రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
` బిజెపికి ఓటేస్తే బిసి సిఎం.. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లకు వేస్తే కుటుంబ సీఎం
` జమ్మికుంట, మంచిర్యాల సభల్లో అమిత్‌ షా ప్రచారం
కరీంనగర్‌ బ్యూరో / జమ్మికుంట(జనంసాక్షి):అబద్ధాల కేసీఆర్‌ ను  ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని ఇంకా వేచిచూసే ధోరణికి తెరదించి ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకి అత్యధిక మెజార్టీని కట్టబెట్టి ఈటెల రాజేందర్‌ ను ఎనిమిదవ సారి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజరాబాద్‌ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సకలజనుల విజయసంకల్ప సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ… కెసిఆర్‌ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని నీళ్ళు నిధులు నియామకాల పేరుతో ఏర్పాటైన తెలంగాణలో సామాన్య ప్రజలకు ఒరిగింది ఏం లేదని పూర్తిగా కెసిఆర్‌ కుటుంబానికి లాభం చేకూరిందని అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. కెసిఆర్‌ అవినీతి పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని వచ్చే నెల మూడు తారీకు తర్వాత రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం కెసిఆర్‌ కుటుంబ పాలనపై చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీసీ రాజ్యాధికారమేనని అమిత్‌ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని  బిఆర్‌ఎస్‌ , కాంగ్రెస్‌ పార్టీ లు రెండు ఒకే కోవకు చెందినవని కెసిఆర్‌ ప్రభుత్వం కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందని అలాంటి కెసిఆర్‌ ను గద్దె దింపి కుటుంబ పాలనను అంతమొందించేందుకు ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి దేశ రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… 119 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు గెలవాలని రాష్ట్రమంతా పక్షిలా తిరిగి వచ్చానని  నా భార్య జమున అన్నీ అమ్మి పెడతా కూలిపని అయినా చేస్తా నిన్ను సాదుకుంటా అని కెసిఆర్‌ తో కొట్లా డమని చెప్పింది. అంతే కాదు నెల రోజుల నుండి విూ ఇంటింటికీ నన్ను గెలిపించాలని వచ్చిందనిమాదిగల ముప్పై ఏళ్ల సమస్యను బీజేపీ తీర్చిందని  మోదీ  విూ సమస్యపై దృష్టి పెట్టారు. మాదిగ జాతి బిజెపికి అండగా ఉంటుందని ఆ  జాతి ప్రకటించిందన్నారు. రెండేళ్లుగా మా కార్యకర్తలను కోపం అనే నరం తెంపుకోమని చెప్పాను. మన లక్ష్యం ఈ చిల్లరగాళ్ళతో కొట్లాటకాదని కెసిఆర్‌ ను ఓడిరచడమే అని  ఎన్ని అవమానాలు చేసిన ఓపికతో ఉంటున్నామనికెసిఆర్‌ డబ్బులు ప్యాక్‌ చేశారట, మందు సీసాలు రెడీ చేశారట వచ్చినవి అన్నీ తీసుకోండి అని తెలిపారు.ప్రతి ఒక్కరూ విూ ఎలక్షన్‌ అని కొట్లాడండి.ఈ గెలుపు విూ గెలుపు. ఈటలరాజేందర్‌ ప్రగల్భాలు పలికేవాడు కాదని ఏతులకు పొడని నేను మాట ఇస్తే కట్టుబడి ఉంటా.. కెసిఆర్‌ లెక్క మాట తప్పను. ఈసారి గెలిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ వస్తె వరి మద్దతు ధర 2160 నుండి 3100 రూపాయలకు పెంచుతాం అని ఒక్క కిలో తరుగులేకుండ కొంటాం అని మహిళలకు నాలుగు సిలిండర్లు, పదిలక్షల లోపు ఉచితవైద్యం, పిల్లలకు ఉచిత ఇంగ్లీష్‌ విూడియం విద్య, ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాల పైసలు, ఆడబిడ్డలకు ఇన్సూరెన్స్‌ ఉచితంగా, రైతు చనిపోతే ఐదు లక్షలు ఎలా వస్తాయో రైతు కూలీ చనిపోతే కూడా ఐదు లక్షల రూపాయలు అందిస్తామని సొంత ఇంటి కల నెరవేరుస్తామని ముసలి వారి ఇద్దరికీ పెన్షన్‌ అందిస్తామని ఇవన్నీ రావాలంటే కెసిఆర్‌ ఓడిపోవాలి విూ బిడ్డ ఈటెల రాజేందర్‌ గెలవాలన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఎంతమంది ప్రాణాలు కాపాడానో విూ అందరికీ తెలుసు.ఉద్యమ బిడ్డగా, ఆర్థిక మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నడు కూడా విూకు  కూడా అన్యాయం చేయలేదని ప్రజల నోట్లో నాలుకలాగా ఉన్నాను రేపు కూడా అలానే ఉంటానని కొంతమంది నా దగ్గరే ఉండి  బయటకు పోయి నన్ను ఓడగొట్టాలని మాట్లాడుతున్నారంట అనిఓడ కొట్టే సత్తా కెసిఆర్‌ కి, కేసీఆర్‌ బ్రోకర్లకి, పైసలకు అమ్ముడు పోయేవారికి లేదని ఆ సత్తా హుజురాబాద్‌ నియోజకవర్గం ప్రజలకు మాత్రమే ఉంటుందని  నేను ఏం నష్టం చేశానని వారు నన్ను ఓడగొడతారని వారి కళ్ళల్లో మెదిలిన బిడ్డను నాకు కులం లేదు, మతం లేదు, ఉన్నంతకాలం పార్టీతో సంబంధం లేకుండా కష్టంలో ఉన్న వారిని ఆదుకున్న బిడ్డ ఈటల రాజేందర్‌ అని తెలిపారు.కేసిఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం, నిరుద్యోగ భృతి ఏ హావిూ అమలుచేయకుండా ప్రజలను వంచిచారు.గజ్వేల్‌ కి ఉత్తగా పోలేదని కెసిఆర్‌ ను గెలిపించిన పాపానికి వేల ఎకరాల భూమి గుంజుకొని గోసపెడుతున్నారని ఓట్లు వేసేది ప్రజలు విూ ఆత్మను ఆవిష్కరించివేయండన్నారు. నలభై ఏళ్లుగా ఇక్కడ కాంగ్రెస్‌ లేదని 1985 లో దామోదర్‌ రెడ్డి గెలిచాక ఇప్పటివరకు ఎవరు ఎన్నడు గెలవలేదని నాఇంటికి ఎవరు వచ్చినా ఉన్నంతలో ఆదుకున్నా తప్ప ఉత్త చేతులతో పంపించలేదని అధికారం వస్తే విూరు అడుక్కునే దగ్గర కాదు ఇచ్చే దగ్గర ఉంటారు. వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్ననని కార్యకర్తలు, నాయకులు ఈ రెండు రోజులపాటు నిద్రపోకుండా కష్టపడి పనిచేసి గొప్ప మెజారిటీతో నన్ను గెలిపించాలని ఈటెల రాజేందర్‌ కోరినారు.