తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటం చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి : బిజెపి రాష్ట్ర నేత కొలను శంకర్

ఎల్బీ నగర్( జనం సాక్షి  )    తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటం చరిత్రను ,త్యాగధనుల ను రేపటి తరానికి తెలియజేయడానికి ఈ అంశాలను పాఠ్యాంశాలలో చేర్చాల అని బిజెపి రాష్ట్ర నేత  కొలను శంకర్ రెడ్డి డిమాండ్ చేసారు ..మహేశ్వరం అసెంబ్లీలోని  బాలాపూర్ లో  జరిగిన కార్యక్రమంలో       బిజెపి రాష్ట్ర నేత  కొలను శంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై  బిజెపి  శ్రేణులతో కలిసి  జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది,  బిజెపి రాష్ట్ర నేత  కొలను శంకర్ రెడ్డి మాట్లాడుతూ  .నాడు సర్దార్ పటేల్ నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం  చేస్తే… నేడు బిజెపి నిజాం వారసుల మెడలు వంచి  తెలంగాణ విమోచన దినోత్సవ లను ఘనంగా నిర్వ యించింది, ఇందులో అందరిని భాగస్వాములను చేసింది ఇది కేవలం బిజెపికే సాధ్యము అన్నారు బిజెపి నేత కొలను శంకర్ రెడ్డి,  తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటం చరిత్రను ,త్యాగధనుల ను రేపటి తరానికి తెలియజేయడానికి ఈ అంశాలను పాఠ్యాంశాలలో చేర్చాలి అని డిమాండ్ చేసారు ., కర్ణాటక ,మహారాష్ట్ర లో ప్రభుత్వం అధికారిక నిర్వహిస్తుంటే తెలంగాణలో ఎందుకు నిర్వహించ రణి ప్రశ్నించారు ,  అందుకే బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు గా జరిపింది అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మున్సిపల్ నాయకులు నవారు శ్రీనివాస్ రెడ్డి, కొంతం సంపత్ రెడ్డి, రంగ బాలయ్య గౌడ్,  కొలను కృష్ణారెడ్డి, కుమ్మరి సత్తయ్య, శంకరప్ప, జో రాల ప్రభాకర్, సామ వెంకట్ రెడ్డి , రామిడి శేఖర్ రెడ్డి , పెద్ది సుధాకర్, రవికుమార్, ఆలేటి శ్రీకాంత్, అంజి బాబు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది