తెలంగాణ సాధిస్తాం
ఆదిలాబాద్, నవంబర్ 14: ప్రజల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1046వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు ఆత్యహత్యలకు పాల్పడుతున్నా టిడిపి, కాంగ్రెస్‌లలో ఎలాంటి చలనం లేదన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్, టిడిపిలు కలిసి రాకపోతే ఈ ప్రాంతంలో వారి చిరునామా లేకుండా చేస్తామన్నారు. ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని ప్రజలు తిరగబడితే కాంగ్రెస్, టిడిపిలు ఖతం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.