తెల్లరేషన్‌ కార్డు దారుల నుంచి ఏసీబీ వివరాలు

చీపురుపల్లి: మద్యం దుకాణాలు కలిగిన తెల్లరేషన్‌ కార్డుదారుల నుంచి వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పరిశీలన జరిపారు. మొత్తం 8మంది ఇళ్లకు వారు వెళ్లగా ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అతని నుంచి వివరాలు సేకరించారు. మిగతా వారి వివరాలు ఇచ్చేందుకు తమను కార్యాలయంలో సంప్రదించాలని వారి కుటుంబీకులకు నోటీసులు జారీచేశారు.