దళితుల హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణ ప్రభుత్వాలు

చేర్యాల జూన్‌ 6 (జనంసాక్షి):
దళితులను ఓట్లేసే మరయంత్రాలుగా వాడుకుంటు వారి హక్కుల్ని కాలరాస్తు ఆగ్ర వర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని తెలంగాణ మాల మహానాడు మండలాధ్యుక్షుడు బుట్టి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం పట్టణ కమిటీి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు పాలక ప్రభుత్వాలు ఆగ్రవర్ణాలు ఆధిపత్యంలో ఉన్నాయి. దళితులకు దళిత మేదావులు, నిమ్న జాతుల్ని చైతన్య పరచవలసిన ఆవసరం ఉందన్నారు. లేకుంటే అగ్ర వర్ణాలపై నమోదయ్యె ఆట్రాసిటి కేసులు నీరుగారి పోయె ప్రమాదముందని ఇప్పటికే వాటిని నిర్విర్యం చేస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. అత్యాచారపు కేసులను దళిత సంఘాల ఆధ్వర్యంలో విచారణ చేయ్యాలని కోరారు. మాల మహానాడు మండల నాయకులు నీరటి ఆనిల్‌ కుమార్‌, కల్లాటి కేశవులు, పరుశరాములు, వెంకటేశ్‌, బాలయ్య, తదితరులున్నారు.