దిశ ఎన్‌కౌంటర్‌ పాపంనేనెరగను..

share on facebook


` విషయం తెలిశాక చటాన్‌పల్లికి వెళ్లాను
`మీడియా సమావేశంలో పలు అంశాలు నాకు తెలుగురాకపోడం వల్ల అట్లామాట్లాడి ఉండొచ్చు..
` సిర్పూర్కర్‌ కమిషన్‌కు తెలిపిన సజ్జనార్‌
హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను కమిషన్‌ విచారించింది. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌ రెడ్డి, 2019 డిసెంబర్‌ 6వ తేదీ ఉదయం తనకు చెప్పారని.. విషయం తెలుసుకొని ఎన్‌కౌంటర్‌ జరిగిన చటాన్‌పల్లికి వెళ్లానని సజ్జనార్‌ కమిషన్‌కు తెలిపారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌కు న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్న అడ్వొకేట్‌ సూచన మేరకు ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు సజ్జనార్‌ చెప్పారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో నిర్వహించిన విూడియా సమావేశంలోని పలు అంశాలను కమిషన్‌ ప్రస్తావించగా.. తెలుగు తన మాతృభాష కానందున ఆ సమయంలో కొన్ని తప్పుగా మాట్లాడినట్లు సజ్జనార్‌ వివరించారు. దిశ హత్యాచారం, నిందితుల అరెస్ట్‌, ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించే ప్రక్రియను అంతా శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి పర్యవేక్షించారని సజ్జనార్‌ కమిషన్‌కు వెల్లడిరచారు.

Other News

Comments are closed.