దేవాదాయ శాఖ కార్యాలయం ముందు హిందూ సంఘాల ధర్నా
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రకాళి, మేడారం సమ్మక్క సారక్క, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయాల ఆదాయంలో ఉన్న డబ్బులను దేవాదాయ శాఖ కార్యాలయం నిర్మాణం కొరకు ఒకొక్క దేవస్థానం నుండి దాదాపు కోటి రూపాయలు తీసుకునే విధంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం సెంట్రల్ జైలు ఎదురుగా గల దేవాదాయ శాఖ కార్యాలయం ముందు హిందూ సంఘాల అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ధర్నాలో పాల్గొన్న బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వీ.హెచ్.పీ జిల్లా అధ్యక్షుడు కేశిరెడ్డి జయపాల్ రెడ్డి, కార్యదర్శి శ్రీరామ్ ఉదయ్, మరియు బిజెపి, భజరంగ్ దళ్, హందువహిని,ఎబివిపి, నాయకులు, కార్యకర్తలు.భక్తుల కానుకలతో ఎండోమెంట్ ఆఫీస్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని నిరసిస్తూ ఆందోళనలు.ఆలయాల నుండి తీసుకున్న 4కోట్లను ఆలయాలకు తిరిగి ఇవ్వాలి.. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తాం.ఎండోమెంట్ ఉద్యోగుల జీతాలను ఆలయాల నుంచి చెల్లించే నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు