దేశంలో అణువిద్యుత్‌ కేంద్రాలు సురక్షితం కాదు: కాగ్‌

ఢిల్లీ: దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాలు సురక్షితం కాదని కాగ్‌  పేర్కొంది. ఆకస్మికంగా ఏదైనా ఘటన జరిగితే దాన్ని ఎదుర్కొనే వ్యవస్థ అణువిద్యుత్‌ కేంద్రాల్లో లేదని కాగ్‌ తెలిపింది. అణువిద్యుత్‌  కేంద్రాలపై కాగ్‌ ఈ రోజు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది.