దేశంలో కొత్త‌గా 3,714 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 2,513 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 26,976 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 194.27 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.