దౌల్తాబాద్ లో కల్వకుంట్ల తారకరామారావు రోడ్ షో కార్యక్రమంను విజయవంతం చేయాలి: జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీ

దౌల్తాబాద్ నవంబర్ 20(జనం సాక్షి ).దుబ్బాక గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్, మండల యూత్ నాయకులు సయ్యద్ కలిలోద్దీన్ లు పేర్కొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు.ఈనెల 21న మధ్యాహ్నం 1 గంటలకు దౌల్తాబాద్ లో జరిగే రోడ్ షో కార్యక్రమంలో ఎంపీ, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో లో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ద్వారా రోడ్ షో వద్దకు చేరుకోవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున యువకులు బైక్ ర్యాలీ ద్వారా ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి, కార్యక్రమంకు తరలివొచ్చి విజయవంతం చేయాలని కోరారు.

తాజావార్తలు