ధనిక రాష్ట్రమైతే.. చార్జీలు పెంచాల్సిన అవసరమేముంది?: షబ్బీర్‌అలీ

oioq0hybహైదరాబాద్‌, మార్చి 28: ప్రభుత్వం దొంగచాటుగా విద్యుత్‌ చార్జీలు పెంచిందని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. మండలిలో బడ్జెట్‌ ఆమోదం పొందగానే కేసీఆర్‌ చార్జీలు పెంచారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమన్న సీఎం.. ఇప్పుడు విద్యుత్‌ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలపై రూ.20 వేల కోట్లు అదనపు భారం వేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, ఇందుకు బడ్జెట్‌ లెక్కలు చూస్తే అర్థమవుతుందని చెప్పారు. విద్యుత్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.