ధావన్‌(187) ఔట్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. తొతి టెస్టులోనే అజేయంగా రాణించిన ధావన్‌ (187) లైయోన్‌ బౌలింగ్‌లో కోవాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ద్విశతకానికి చేరువలో ధావన్‌ వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. వికెట్లేమి కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీంఇండియా వికెట్‌ నష్టానికి 290 పరుగులతో ఆడుతోంది.