ధ్రువ పత్రాల కుంభకోణం కేసులో ఏడుగురిపై కేసులు

వరంగల్‌ : కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టంచిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రణాధికారితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.