నందులపల్లి లో ముగ్గుల పోటీ.

ఫోటో రైటప్: విజేతలకు బహుమతులు అందజేస్తున్న అధికారులు.
బెల్లంపల్లి, ఆగస్టు20, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నందులపల్లి, గొల్లపల్లి, మెట్ పల్లి, నెన్నెల గ్రామ పంచాయతీలలో శనివారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దేశభక్తి అంశంపై చేపట్టిన ముగ్గుల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నందులపల్లి ముగ్గుల పోటీల్లో ఎంపిఓ శ్రీనివాస్, ఏపీఓ నరేష్, సర్పంచ్ బోయిని మల్లేష్, పంచాయతీ కార్యదర్శి పద్మనాభం, గొల్లపల్లి లో సర్పంచ్ ఇందూరి శశికళ, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, మన్నెగూడెం లో సర్పంచ్ గొర్లపల్లి బాపు, పంచాయతీ కార్యదర్శి రెహానా, నెన్నెలలో సర్పంచ్ తోట సుజాత, పంచాయతీ కార్యదర్శి సాగర్, ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.