నకిలీ జీవో సృష్టికర్తల అరెస్టు

విశాఖపట్నం: సింహాచలం ఆలయ భూమి క్రమబద్ధీకరణకు ఏకంగా నకిలీ జీవో సృష్టించిన ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ అధికారి కూడా ఉన్నారు. కాకినాడ డిప్యూటీ సర్వేయర్‌ రాఘవరావు, ఆయన సోదరుడు బాలకృష్ణను ఈ కేసులో సీఐడీ అరెస్టు చేసింది.