నల్గొండలో పరిస్థితి ప్రశాంతం

నల్గొండ: నల్గొండ పట్టణంలో పరస్థితి ప్రశాంతంగా ఉందని హైదరాబాద్‌ రేంజీ ఐజీ రాజీవ్‌ రతన్‌ తెలిపారు. పట్ణణంలో పర్యటించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వల్ప ఘటనలతో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని చెప్పారు. కొన్ని అని వార్య కారణాలతో ఏర్పడిన అల్లర్లను జిల్లా యంత్రాంగం అదుపులోకి తీసుకువచ్చిందని తెలిపారు. అల్లర్లకు కారణమైనవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.ఇప్పటీకీ 11 కేసులు నమోదు చేసి 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈరోజు పరిస్థితిని బట్టి 144 సెక్షన్‌ కొనసాగింపుపై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.