నవంబరు ఆఖరులో గుజరాత్‌లో ఎన్నికలు

న్యూఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు నవంబరు నెలాఖరులో గానీ, డిసెంబరు మొదటివారంలో గానీ జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారులతో ఈసీ సంప్రదింపులు అరంభించింది. గుజరాత్‌ శాసనసభ గడువు జనవరి 17తో హిమాచల్‌ గడువు జనవరి 10వ తేదీతో ముగియనుంది.