* నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలి
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలో శుక్రవారం గణేష్ మండప నిర్వహకులతో పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని కోరారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు, గణేష్ ఉత్సవాలు సజావుగా సాగేందుకు పోలీసులు సూచించిన తగు సూచనలు పాటించడంతోపాటు పోలీసులకు సహకరించాలని కోరారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశానికి హాజరైన పలు నిర్వాహకుల నుండి సలహాలు సూచనలు స్వీకరించడంతోపాటు పోలీసులు పోషించే పాత్రను వివరించారు. డీజేలపై నిషేధాజ్ఞలు ఉన్నాయని తెలిపారు. అల్లర్లు జరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తే ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇతర వర్గాల కు చెందిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని, తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి.చంద్రమోహన్, ఏసీపీలు
తుల శ్రీనివాసరావు, ప్రతాప్ లు ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు (సి ఎస్ బి ), సిహెచ్ నటేష్, దామోదర్ రెడ్డి లతోపాటు పలువురు పోలీసు అధికారులు, గణేష్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.