నార్త్‌ బ్లాక్‌కు చేరుకుంటున్న ప్రతినిధులు

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్ష భేటీ కి హాజరయ్యేందుకు వివిధ పార్టీల ప్రతినిధులు నార్త్‌బ్లాక్‌లోని హోంమంత్రి కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. 11.30కు హోంమంత్రి షిండే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.