నాలుగో రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పల్లెబాట  జోరుగా కొనసాగుతొంది. ఊరురా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగులుతోంది గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలకు తెలంగాణవాదులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. వాడవాడన ‘ జైతెలంగాణ ‘ నినాదాలు మర్మోగుతున్నాయి. కళాకారులు తెలంగాణ ఆటపాటలతో జనాలను హుషౄరెత్తిస్తున్నారు. సమైక్య పార్టీలను తరిమికొట్టాలని టీఆర్‌ఎస్‌ నేతలు పిలుపునిస్తున్నారు. జనంతోమమేకమై తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరంగా చెబుతున్నారు. బాబు షర్మిల పాదయాత్రలను నమ్మవద్దని, తెలంగాణను  అడ్డుకున్నది వారేనని ప్రజలకు వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పల్లెబాటలో తెలంగాణవాదులు భారీగా పాల్గొంటున్నారు.