నిందితుడికి ఆరునెలలు జెలుశిక్ష

భైంసా: ద్విచక్రవాహన దొంగతనం కేసులో రవి అనే నిందితునికి న్యాయస్థానం ఆరునెలల జైలుశిక్ష విధించింది. భైంసా పట్టణానికి చెందిన సాంబ సదాశివ్‌ ద్విచక్రవాహనం ఏప్రిల్‌ 4న చోరీ అయింది. బాధితుని ఫిర్యాదుమేరకు పట్టణ ఎస్సై అమృతరావు కేసు నమోదుచేసి దర్యాప్తు జరిపారు. కుంటాల మండలం వెంకూర్‌కు చెందిన దండుల్ల రవిని నిందితుడిగా గుర్తించి కోర్టులో హజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి ఆరునెలల జైలుశిక్ష విధించారు.