నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న రంగ సాయి లక్ష్మీ

నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న రంగ సాయి లక్ష్మీ…జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రానికి చెందిన రంగ మంజుల – శంకరయ్య దంపతుల కుమార్తె అయినా రంగ సాయి లక్ష్మీ – మణి కాంత్ గార్ల ముప్పాయి రెండవ జన్మదినాన్ని పురస్కరించుకోని మంగళవారం ఉదయం వేళలో ఆర్థికంగా, అనారోగ్య కారణాలతో బాధపడుతున్న.. ధర్మపురి పట్టణ, మండల కేంద్రానికి చెందిన, పది మంది నిరుపేద కుటుంబ సభ్యులకు సుమారు రెండు వేళ ఐదు వందల రూపాయలకు పైగా విలువ కలిగిన నేల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు, పట్టు వస్త్రాలు, నగదు రూపేణా, సుమారు ఇరవై ఐదు వేళ రూపాయలకు పైగా, ఆర్థిక సహాయాన్ని నిరుపేద కుటుంబ సభ్యులకు, తమ కుమార్తె అయినా సాయి లక్ష్మీ – మణి కాంత్ చేతుల మీదుగా వారికీ ఘనంగా అందజేశారు. నిరుపేద కుటుంబ సభ్యులకు ధన, వస్తు రూపేణా, ఆర్థిక సహాయం అందజేసిన సాయి లక్ష్మీ – మణి కాంత్ దంపతులను సీనియర్ సామాజిక సేవా కార్యకర్తలు అయినా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వచ్ఛందా సేవా సంస్థ సభ్యులు రంగ హరినాథ్, పప్పుల శ్రీనివాస్,జైషేట్టి రాజేష్, స్తంభం కాడి జగదీష్, రంగు లక్ష్మీ నరహరి,ఇందారపు రామ్ కిషన్ లతో పాటు,తదితరులు కార్యక్రమంలో పాల్గోని వారికీ హృదయ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా అభినందించారు.