నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై చర్యలు

రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్లు

హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘిస్తు తనిఖీల్లో పట్టుబడిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణాశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లఘించి తిరుగుతోన్న 75 ప్రైవేటు బస్సులు, 80 పాఠశాల బస్సులు స్వాధీనం చేసుకున్నట్లు సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్లు తెలెపారు. పట్టుబడిన వాహన యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.