నిరుద్యోగ మహాధర్నాను విజయవంతం చేద్దాం

మంత్రి కేటీఆర్ ను వెంటనే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి. TS PSC ని వెంటనే రద్దు చేయాలి గ్రూప్ వన్ అభ్యర్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి టిఎస్పిఎస్సి చైర్మన్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మార్చి 25 శనివారం రోజున హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఐటీ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని, నిరుద్యోగులకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని లీకేజి విషయమై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాను విజయవంతం చేయాలని బిజెపి జగిత్యాల జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుండి నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని, అందులో భాగంగానే నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని ఇచ్చిన నోటిఫికేషనలపై కోర్టుకు వెళ్లి స్టేలు తేవడం మరియు ప్రశ్నాపత్రాలు లీకులు మొదలగు విషయాలు నిరుద్యోగుల పట్ల శాపంగా మారిందని, వారి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని అన్నారు. నిరుద్యోగ నిర్మూలన అంటూనే మరోపక్క ఉద్యోగుల వయోపరిమితి మూడేళ్లు పెంచి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది అని, ఉపాధి హామీలో పని చేసే క్షేత్ర సహాయకులను 12,000 మందిని తొలగించి రెండేళ్ల పాటు వాళ్ళ జీవితాలను రోడ్డుపాలు చేసిందని అన్నారు. అంతే కాకుండా ముఖ్యమైన రెవెన్యూ శాఖను పెద్దల పాలు చేయడానికి వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి మిగతా శాఖలో విలీనం చేసి నిరుద్యోగుల్లో నిరాశ నింపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకే నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాను విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర పిలుపు మేరకు కలసి రావాలని జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ కోరారు.