నీటి కాలుష్య నివారణ మార్గాలపై పీఏసీ దృష్టి

న్యూడిల్లీ: పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) నీటి కాలుష్యాన్ని జాతీయ సంక్షోభంగా అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటంపై అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటం పై అభిప్రాయాలను కోరుతూ అరు కేంద్ర మంత్రిత్వశాఖల అధికారుల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నీరు కేవలం ఒక మంత్రిత్వశాఖ మాత్రమే పరిమితమైంది కాదు.కాబట్టి నీటి కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు బహుళ సంస్థల విదానాన్ని గుర్తించాలని భావిస్తున్నాం.ఇందుకోసం నీటి వనరులు,వ్యవసాయం,పట్టణాభివృద్ధి.పంచాయతిరాజ్‌.గ్రామీణాభివృద్ధి.పారిశుద్ధ్య తాగునీటి శాఖల అధికారులు సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించాం.అని పార్లమెంట్లు ప్రజాపద్దుల సంఘం సభ్యుడొకరు తెలిపారు.