నీతి, నిజాయితీలకు నిలువుటద్ధం ఎర్రన్న!
శ్రీకాకుళం: నీతి నిజాయితీ, నిర్భీతికి ఎర్రన్నాయుడు నిలువుటద్ధమని భాజపా నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఎర్రన్నాయుడి సంస్మరణ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ తెదేపా నేతగా కాకుండా తెలుగువారి నేతగా ఢిల్లీలో గుర్తింపు పొందారని అన్నారు. ఎర్రన్నా మృతి శ్రీకాకుళం జిల్లాకే కాదని రాష్ట్రానికే తీరని లోటని తెరాస నేత జి, వినోద్ వ్యాఖ్యానించారు. ఎర్రనాయుడి మృతి తెదేపా శ్రేణులను తీవ్రంగా కలచి వేసిందని, అందరం కన్నీటి పర్యంతమయ్యామని ఎర్రబెల్లి దయాకరరావు ఆవేదన వెలిబుచ్చారు.