నూతన ఇసుక విధానంపై ఆరుగురు మంత్రుల ఉపసంఘం ఏర్పాటు
హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ఖరారుకు ఆరుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం ఏర్పాటైంది. ఉప సంఘం సభ్యులుగా మంత్రులు జానారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, గల్లా అరుణ, సుదర్శన్‌రెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, టీజీ వెంకటేష్ ఉన్నారు. నూతన ఇసుక విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేసి వారం రోజుల్లోగా ప్రభాత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.