నెలరోజుల్లో స్పష్టతిస్తాం

ఇదే చివరి అఖిలపక్షం : షిండే

ప్రణబ్‌ ముఖర్జి లేఖకు కట్టుబడ్డాం : టీడీపీ

నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు : వైఎస్సార్‌సీపీ

రాష్ట్రాన్ని విభజిస్తే రాయల తెలంగాణ : ఎంఐఎం

పార్లమెంట్‌లో బిల్లుపెడితే అభ్యంతరం లేదు : సీపీఎం

కాంగ్రెస్‌ మినహా అన్ని పార్టీల వైఖరి సుస్పష్టం

పార్టీ       హాజరైన ప్రతినిధులు

కాంగ్రెస్‌      సురేశ్‌రెడ్డి, గాదె వెంకట్‌రెడ్డి

టీడీపీ      కడియం శ్రీహరి, యనమల                 రామకృష్ణుడు

టీఆర్‌ఎస్‌      కేసీఆర్‌, నాయిని               నర్సింహారెడ్డి

బీజేపీ      కిషన్‌రెడ్డి, హరిబాబు

వైఎస్సార్‌ సీపీ మైసూరారెడ్డి, మహేందర్‌రెడ్డి

సీపీఐ      నారాయణ, గుండా మల్లేశ్‌

సీపీఎం      రాఘవులు, జూలకంటి                 రంగారెడ్డి

ఎంఐఎం      అసదుద్దీన్‌ ఓవైసీ, జీవీజీ               నాయుడు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి) :

తెలంగాణ అంశంపై నెలరోజుల్లో స్పష్టమైన ప్రకటన చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. శుక్రవారం నార్త్‌ బ్లాక్‌లోని రూమ్‌ నం.3లో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి ఎనిమిది  రాజ కీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజర య్యారని చెప్పారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో ప్రశాంతంగా జరిగిందన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి వారి అభిప్రాయాలను తెలిపారన్నారు. వాటన్నిం టిని తాను క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పారు. సమావేశ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తానని దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుం టుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, యువత సంయమనంతో శాంతియుతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమవేశంలో కొన్ని పార్టీల ప్రతినిధులు ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్క రించాలని కోరగా, మరికొందరు నెలరోజుల్లోనే పరిష్కరించాలని కోరారని తెలిపారు. సమావేశ వివరాలను  కేంద్రమంత్రి మండలికి వివరి స్తానని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుం టామన్నారు. సమావేశంలో ఏ పార్టీలు ఎలాంటి వైఖరి చెప్పాయని ప్రశ్నించగా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశ వివరాలు ప్రభుత్వానికే వివరిస్తానని, బహిరంగంగా వెల్లడించేందుకు ఇది సరైన వేదిక కాదన్నారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ మినహా అన్ని రాజకీయ పక్షాలు దాదాపు స్పష్టమైన వైఖరి వెల్లడించాయి. ఉదయం పదిగంటలకు ప్రారంభమైన సమావేశం 11.30 గంటలకు ముగిసింది. సమావేశ అనంతరం షిండే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పది నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.